నీ కొరకు నా ప్రాణం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది (2)
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము (2)

పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2)       ||దేవా||

నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)
నను మన్నించుమా నా తండ్రి (2)

English Lyrics

Audio

కావలివాడా ఓ కావలివాడా

పాట రచయిత:సిద్దిపేట ప్రకాష్
Lyricist: Siddipet Prakash

Telugu Lyrics

కావలివాడా ఓ కావలివాడా
కనులు తెరచి పొలమును చూడు
కోతకు వచ్చిన పంటను కోయుము        ||కావలి||

పిలిచెను నీ యజమానుడు
జత పనివాడవై యుండుటకు (2)
కొలుచును నీ ఫలమంతమున
పని చేసిన రీతిగనే (2)     ||కావలి||

నమ్మెను నీ యజమానుడు
అప్పగించెను తన స్వాస్థ్యము (2)
తిరిగి వచ్చును జీతమియ్యను
సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2)     ||కావలి||

ఎంచెను నీ యజమానుడు
నీ పాదములు సుందరములని (2)
ఉంచెను కర్మెలు పర్వతముపై
పరుగిడుము పరాక్రమ శాలివై (2)     ||కావలి||

వేయుము పునాది నేర్పరివై
చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2)
కొయ్య కాలును కర్ర గడ్డియు
కాలిపోవును అగ్ని పరీక్షలో (2)     ||కావలి||

English Lyrics

Audio

కళ్లుండి చూడలేని

పాట రచయిత: ఎం మార్క్, స్వెన్ ఎడ్వర్డ్స్
Lyricist: M Mark, Sven Edwards

Telugu Lyrics


కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)
వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే
జీవింప చేయాలి నీ మహిమలోనే      ||కళ్లుండి||

కంటి చూపుతో నన్ను కాచియున్నావు
గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)
మరణాన్ని తప్పించావు
జీవాన్ని నాకిచ్చావు (2)
ఇంకేల నా యేసయ్యా          ||కళ్లుండి||

నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు
నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)
నీవే నా గమ్యమని
నీలోనే నడిచెదను (2)
నాకేగా పరలోకము      ||కళ్లుండి||

English Lyrics

Audio

 

 

ఆకాశమందున్న ఆసీనుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను        ||ఆకాశ||

దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

English Lyrics

Audio

HOME