ఇంటి మీద నున్న

పాట రచయిత: బొనిగల బాబు రావు
Lyricist: Bonigala Babu Rao

Telugu Lyrics

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా          ||ఇంటి మీద||

వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

English Lyrics

Audio

నా ప్రాణమా నాలో నీవు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు (2)          ||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ (2)
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా (2)
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ (2)
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా (2)
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2)        ||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ (2)
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ (2)
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2)     ||నా ప్రాణమా||

English Lyrics

Audio

HOME