కృపా సత్య సంపూర్ణుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

స స స ని స గ… స స స ని స గ
స స స ని స గ మ ప
మ మ మ గ ప మ… మ మ మ గ ప మ
మ మ మ గ ప మ గ స

కృపా సత్య సంపూర్ణుడా (2)
కృపామయుడా
కృప చూపుటే నీ సంకల్పమా       ||కృపా||

స ని స ని మ ప
ని ప ని ప గ మ
ప మ ప మ గ ని స

నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా (2)
మార్పులేని నీ మహా కృపలో (2)
మహిమ రాజ్యమున చేర్చుమా       ||కృపా||

నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు (2)
నిత్యముండు నీ కృపతో (2)
నిరతము నను గావుము ప్రభువా       ||కృపా||

స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప
మ ప మ ని ని… ప ని ప స స (2)
ప ని స గ స ని… మ ప ని స ని ప
గ మ ప ని ప మ… గ మ గ రి స (2)

నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన ప్రభువా (2)
అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)
హతమొందించెద నీ కృపతో       ||కృపా||

English Lyrics

Audio

కృపామయుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…

ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపామయుడా||

చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2)       ||కృపామయుడా||

నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపామయుడా||

ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2)      ||కృపామయుడా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME