రాతి సమాధిలో

పాట రచయిత: పి జె పాల్
Lyricist: P J Paul

Telugu Lyrics


రాతి సమాధిలో పాతిన మన యేసు
లేచెను ఈనాడు జై జై జై (2)

దేవాలయము మూడు దినముల లోపల (2)
పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2)
ఆ బండ నెవరు దొర్లించకుండనే
తెరువంగ బడి యుండె జై జై జై (2)         ||రాతి||

వేకువ జామున చీకటి యుండగ (2)
ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2)
ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా
ముందే లేచియుండె జై జై జై (2)         ||రాతి||

ఆ మింట నున్న నా తండ్రి కడకు (2)
నేనిపుడేగెద నన్నంటకు (2)
తొలిసారి మరియకు కనిపించి పలికెను
ఉల్లాసమాయెను జై జై జై (2)         ||రాతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

లేచినాడయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా        ||లేచినాడయ్యా||

శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)           ||క్రీస్తు||

జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను (2)
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై (2)           ||క్రీస్తు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరమ జీవము నాకు నివ్వ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును

యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను             ||యేసు||

పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు||

నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను        ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

గీతం గీతం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2)       || గీతం||

చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు           || గీతం||

వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి          || గీతం||

అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి             || గీతం||

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి          || గీతం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME