కొంతసేపు కనబడి

పాట రచయిత:ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)       ||కొంతసేపు||

ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు         ||యేసే||

చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా         ||యేసే||

నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా         ||యేసే||

English Lyrics

Audio

లోకాన ఎదురు చూపులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

English Lyrics

Audio

యేసు దేవా నను కొనిపోవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు దేవా నను కొనిపోవా
నీ రాజ్యముకై వేచియున్నా (2)
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము        ||యేసు||

ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)         ||యేసు||

నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను         ||యేసు||

English Lyrics

Audio

దేవా మా కుటుంబము

పాట రచయిత: డి జే ఆగస్టీన్
Lyricist: D J Augustine

Telugu Lyrics


దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)
ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ
నీ ఆత్మతో నింపుమా (2)           ||దేవా||

కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు
మాకేమి భయము – మాకేమి దిగులు
నీకే వందనములయ్యా
లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము
లోకాశలు వీడి – లోకంబులోన
నీ మందగా ఉందుము          ||దేవా||

సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు
ఇమ్మహిలో మాకిమ్మయ్యా
ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా
మమ్ములను బలపరచుము         ||దేవా||

ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను
లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా
దాచుము నీ చేతులలో
ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
ఫల సంపదలతోను – కలకాలము జీవించ
కురుపించుము నీ దీవెనలన్         ||దేవా||

పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్
నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో
సంతసంబుగ సాగెదము
వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము
కొంత కాలమే మేము – ఉందుము లోకాన
చెంత చేరగ కోరెదము
నీ చెంత చేరగ కోరెదము            ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాదంటూ లోకాన

పాట రచయిత: సిరివెల్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2)             ||నాదంటూ||

నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2)             ||నాదంటూ||

నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్య (2)             ||నాదంటూ||

English Lyrics

Audio

Download Lyrics as : PPT

HOME