భూమియు దాని సంపూర్ణత

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)

ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2)        ||భూమియు||

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2)        ||భూమియు||

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2)        ||భూమియు||

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2)        ||భూమియు||

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2)        ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2)        ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2)        ||భూమియు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా జీవిత యాత్రలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు (2)       ||నా జీవిత||

పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా (2)
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము (2)       ||నా జీవిత||

నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు (2)
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా (2)       ||నా జీవిత||

ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా (2)
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను(2)       ||నా జీవిత||

ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి (2)
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము (2)     ||నా జీవిత||

సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము (2)
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము (2)     ||నా జీవిత||

English Lyrics

Audio

HOME