న్యాయాధిపతి అయిన దేవుడు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా (2)      ||న్యాయాధిపతి||

ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా (2)
రోగముతో కృశియించగా (2)
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)      ||న్యాయాధిపతి||

గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును (2)
లేదింక నీకు తరుణము (2)
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)      ||న్యాయాధిపతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఓ మానవా నీ పాపం మానవా

పాట రచయిత: సునీల్ ప్రేమ్ కుమార్
Lyricist: Sunil Prem Kumar

Telugu Lyrics


ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)         ||ఓ మానవా||

ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)         ||ఓ మానవా||

ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2)         ||ఓ మానవా||

English Lyrics

Audio

దేవునికి భయపడవా

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా (2)
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)
యేసయ్యను నీవు శరణు వేడుమా (2)       ||దేవునికి||

ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి (2)      ||దేవునికి||

నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు (2)
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2)       ||దేవునికి||

English Lyrics

Audio

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

పాట రచయిత: బాబన్న
Lyricist: Baabanna

Telugu Lyrics

నేడు ఇక్కడ రేపు ఎక్కడో
తెలియని పయనం ఓ మానవా (2)
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2)         ||నేడు||

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు      ||నేడు||

అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట (2)
దిగంబరిగానే నీవు పుడతావు
దిగంబరిగానే నీవు వెళతావు (2)         ||నేడు||

English Lyrics

Audio

 

 

ఓ మానవా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)     ||ఓ మానవా||

సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2)           ||ఈ దినమే||

ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)          ||ఈ దినమే||

నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)           ||ఈ దినమే||

English Lyrics

Audio

రెండే రెండే దారులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా (2)

పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)      ||రెండే||

పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)       ||రెండే||

పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)         ||రెండే||

English Lyrics

Audio

 

 

HOME