మాకు తోడుగ నీవుంటివి

పాట రచయిత: సొలొమోన్ రాజ్
Lyricist: Solomon Raj

Telugu Lyrics


మాకు తోడుగ నీవుంటివి
జీవిత యాత్రలో (2)
మమ్ము విడువని మా దేవా
నిండు మనస్సుతో వెంబడించెదం (2)          ||మాకు||

మాతో కూడా ఉందునంటివి
మారని మా దేవా (2)
పరము చేరు వరకు దేవా
మమ్ము నడిపెదవు (2)          ||మమ్ము విడువని||

శత్రువు మాపై చెలరేగగా
కృంగదీయ జూడగా (2)
యెహోవా నిస్సిగా మాకుండి
విజయమిచ్చితివే (2)          ||మమ్ము విడువని||

కష్టములెన్నెన్నో ఎదురైనా
నిన్నే వెంబడింతుము (2)
మాకు తోడుగా నీవుండగా
మేము భయపడము (2)          ||మమ్ము విడువని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ ప్రేమ మాధుర్యము

పాట రచయిత: Rachel J Komanapalli
Lyricist: రేచెల్ జే కొమానపల్లి

Telugu Lyrics

నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును
నా ఊహ చాలదు ఊపిరి చాలదు
ఎంతో ఎంతో మధురం
నీ ప్రేమ ఎంతో మధురం
ప్రభు యేసు ప్రేమ మధురం
నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో
నిను పూజింతును నా ప్రభువా (2)          ||నీ ప్రేమ||

దేవదూతలు రేయింబవలు
కొనియాడుచుందురు నీ ప్రేమను (2)
కృపామయుడా కరుణించువాడా
ప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2)           ||నా పూర్ణ||

సృష్టికర్తవు సర్వలోకమును
కాపాడువాడవు పాలించువాడవు (2)
సర్వమానవులను పరమున చేర్చెడి
అద్వితీయుడా ఆరాధ్యదైవమా (2)           ||నా పూర్ణ||

English Lyrics

Audio

HOME