నీదు ప్రేమ నాలో

పాట రచయిత: ప్రభు పమ్మి
Lyricist: Prabhu Pammi

Telugu Lyrics

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు
నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు
మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు
మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు
ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో
మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2)

తోడువైనావు నా నీడవైనావు
నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు
మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా
ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా
జీవితమంతా మరువలేనయ్యా           ||నీదు ప్రేమ||

ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు
అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు
నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా
కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా
నేను నిన్ను విడువలేనయ్యా           ||నీదు ప్రేమ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఒంటరితనములో తోడువై

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఒంటరితనములో తోడువై
నాతో నడచిన నా స్నేహమై
ఎడారిలో మార్గమై
చీకటి బ్రతుకులో వెలుగువై
మరువగలనా నీ ప్రేమ నేను
విడువగలనా నీ తోడు నేను
లోకముతోనే ఆనందించిననూ
నీ ప్రేమతో నను మార్చినావు
నా యేసయ్యా.. నా రక్షకా
నను కాచిన వాడా నీవేనయ్యా (2)

ఓటమిలో నా విజయమై
కృంగిన వేళలో ఓదార్పువై
కొదువలో సమృద్ధివై
నా అడుగులో అడుగువై         ||మరువగలనా||

English Lyrics

Audio

నా స్నేహితుడా

పాట రచయిత: డేవిడ్సన్ గాజులవర్తి
Lyricist: Davidson Gajulavarthi

Telugu Lyrics


నీతో స్నేహం నే మరువగలనా
నిన్ను విడచి నేను ఉండగలనా
నీతో స్నేహం నే మరువగలనా
నా స్నేహితుడా… నా యేసయ్యా (2)
విడువక నను ఎడబాయని నేస్తమా         ||నీతో||

నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా
శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా
శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా
లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా
కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా
ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా           ||నా స్నేహితుడా||

నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా
కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా
అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా
ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా
ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా
ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా          ||నా స్నేహితుడా||

English Lyrics

Audio

స్నేహితుడా నా స్నేహితుడా

పాట రచయిత: సిరివెల్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)

నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2)      ||స్నేహితుడా||

నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2)      ||స్నేహితుడా||

కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు (2)      ||స్నేహితుడా||

English Lyrics

Audio

మరువగలనా మరలా

పాట రచయిత: జోనా శామ్యూల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics


మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను

ఆశయు అక్కరయు పాపమై
చిక్కితి శత్రువు చేతులలో
మరణపు టంచున చేరితిని
ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
క్షమియించి విడిపించెను
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను

ఏ పాపికి కడు భాగ్యమే
యేసుని చేరగ ధన్యమే
యేసుని ప్రేమ అనంతమే
నీ పాపమంతా తొలగించి
యేసు ప్రేమించి దీవించును
నీ భారమంతయు భరియించును
కన్నీరు తుడిచి ఓదార్చును
శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఆ సిల్వ ప్రేమను చూపెదను
నా క్రీస్తు వార్తను చాటెదను
జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME