మేఘాల పైన మన యేసు

పాట రచయిత: ఫిలిప్ & షారోన్
Lyricist: Philip & Sharon

Telugu Lyrics


మేఘాల పైన మన యేసు
త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)
సిద్ధపడుమా ఉల్లసించుమా
నీ ప్రియుని రాకకై (2)        ||మేఘాల||

ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు
బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2)
బూర శబ్దం మ్రోగగా
ప్రభుని రాకడ వచ్చును
రెప్ప పాటున పరిశుద్ధులు
కొనిపోబడుదురు ప్రభువుతో           ||మేఘాల||

పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా
దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2)
వినుట వలన విశ్వాసం
కలుగును సోదరా
దేవుని ఆజ్ఞకు లోబడితే
పొందెదవు పరలోకం          ||మేఘాల||

స్తుతియు మహిమ ఘనత ప్రభావం
యేసుకే చెల్లు గాక
తర తరములకు యుగయుగములు
యేసే మారని దైవం (2)
నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ         ||మేఘాల||

English Lyrics

Audio

యేసు రాజుగా వచ్చుచున్నాడు

పాట రచయిత: వీధి ఏలియా
Lyricist: Veedhi Eliya

Telugu Lyrics


యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం        ||యేసు||

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ (2)
వాక్యమే కరువగును         ||యేసు||

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)
న్యాయమే కనబడును        ||యేసు||

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు||

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి        ||యేసు||

English Lyrics

Audio

నేడో రేపో నా ప్రియుడేసు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో||

చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో||

కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో||

నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||

English Lyrics

Audio

 

 

HOME