మేలుకో మహిమ రాజు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

మేలుకో! మహిమ రాజు
వేగమే రానై యున్నాడు (2)

పరమునుండి – బూర ధ్వనితో
అరయు నేసు – ఆర్భాటముతో (2)
సర్వలోకము – తేరిచూచును
త్వరపడు ఓ ప్రియుండా (2)       ||మేలుకో||

గురుతులెల్ల – ధరణియందు
సరిగ చూడ – జరుగుచుండ (2)
చిరునవ్వుతో – చేరి ప్రభుని
త్వరపడు ఓ ప్రియుండా (2)       ||మేలుకో||

క్రీస్తునందు – మృతులెల్లరు
కడబూర – మ్రోగగానే (2)
క్రీస్తువలె – తిరిగి లేతురు
లేతువా? నీవు ప్రియుడా (2)       ||మేలుకో||

అరయంగ – పరిశుద్ధులు
మురిసెదరు – అక్షయ దేహులై (2)
పరమందు – ప్రభుక్రీస్తు
నిరతము – ఓ ప్రియుండా (2)       ||మేలుకో||

కరుణలేని – ఓ మరణమా
నిరతము నీకు జయమగునా (2)
మరణ సంహా – రుండేసు
త్వరగా – రానై యున్నాడు (2)       ||మేలుకో||

మాంసలోక – పిశాచాదులు
హింస పరచ – విజృంభించిన (2)
లేశమైనను – జడియకుము
ఆశతో – కాచుకొనుము (2)       ||మేలుకో||

పాపమును – చేయకుమా
రేపకుమా – దైవ కోపమును (2)
శాపమును – తప్పుకొని
శ్రద్ధతో – కాచుకొనుమా (2)       ||మేలుకో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏ గుంపులో నున్నావో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)
జాగు చేయక వేగ మేలుకో (2)       ||ఏ గుంపులో||

మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)
చచ్చియుండిన సమాధుల గుంపు (2)       ||ఏ గుంపులో||

కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)
కరకు కల్గిన కఠోరపు గుంపు (2)       ||ఏ గుంపులో||

యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2)       ||ఏ గుంపులో||

ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)
కావలి కాయు కఠినాత్ముల గుంపు (2)       ||ఏ గుంపులో||

సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము (2)
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)
గదిలో చేరుకో పదిలపర్చుకో (2)       ||ఏ గుంపులో||

English Lyrics

Audio

ఉతక మీద తలుపు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2)    ||ఉతక||

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును (2)       ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు (2)
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును (2)       ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును (2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2)        ||సోమరీ||

ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో (2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2)        ||సోమరీ||

English Lyrics

Audio

మేలుకో విశ్వాసి మేలుకో

పాట రచయిత: విద్యార్థి గీతావళి
Lyricist: Vidhyaarthi Geethaavali

Telugu Lyrics


మేలుకో విశ్వాసి మేలుకో
చూచుకో నీ స్థితిని కాచుకో (2)
మేలుకో విశ్వాసి మేలుకో
ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2)
ఇహ లోక మాలిన్యం దూరపరచుకో
మదిలోని మురికినంత కడిగివేసికో    ||మేలుకో||

నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త
మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)
విశ్వాసం లేని దుష్ట హృదయము
చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త      ||మేలుకో||

ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా
ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2)
ప్రేమ లేక ద్వేషింప బూనితే
క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా      ||మేలుకో||

English Lyrics

Audio

HOME