భూపునాది మునుపే

పాట రచయిత: జార్జ్ సాంబత్తిని
Lyricist: George Sambathini

Telugu Lyrics


భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము     ||భూపునాది||

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును (2)
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును     ||భూపునాది||

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును      ||భూపునాది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మా ఊహలు పుట్టక మునుపే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)          ||మా ఊహలు||

నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు        ||మా ఊహలు||

ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు         ||మా ఊహలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME