సంగీత నాదముతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత||

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ||

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద (2)
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన          ||నీ ప్రేమ||

నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన         ||నీ ప్రేమ||

English Lyrics

Audio

తంబుర సితార నాదముతో

పాట రచయిత: జోసెఫ్ విజయ్
Lyricist: Joseph Vijay

Telugu Lyrics


తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే (2)        ||తంబుర||

పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే      ||తంబుర||

ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా        ||తంబుర||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రండి సువార్త సునాదముతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2)            ||రండి||

యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం
భాసుర క్రైస్తవ శుభ నామం          ||రండి||

యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం          ||రండి||

యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్ధన సహకారం          ||రండి||

యేసే సంఘములో మన కాంతి
యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి          ||రండి||

యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జన స్తోత్రం          ||రండి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME