నా నాన్న యింటికి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా నాన్న యింటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసుని నేను చూడాలి (2)
నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది
నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది
నా నాన్న యింటిలో నాట్యమున్నది          ||నా నాన్న||

మగ్ధలేని మరియలాగా (2)
నీ పాదాలు చేరెదను (2)
కన్నీటితో నేను కడిగెదను (2)
తల వెంట్రుకలతో తుడిచెదను (2)              ||నా నాన్న||

బేతనీయ మరియలాగా
నీ సన్నిధి చేరెదను (2)
నీ వాక్యమును నేను ధ్యానింతును (2)
ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2)              ||నా నాన్న||

నీ దివ్య సన్నిధి నాకు
మధురముగా ఉన్నదయ్యా (2)
పరలోక ఆనందం పొందెదను (2)
ఈ లోకమును నేను మరిచెదను (2)               ||నా నాన్న||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమ్మ కన్న మిన్న

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2)

ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)        ||నీ ప్రేమ||

English Lyrics

Audio

విలువైనది నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైనది నీ జీవితం
యేసయ్యకే అది అంకితం (2)

ఆ దేవ దేవుని స్వరూపంలో
నిను చేసుకున్న ప్రేమ
తన రూపులో నిను చూడాలని
నిను మలచుకున్న ప్రేమ
ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది
నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
తన కంటి రెప్పలా – నిను కాచేటి
క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…         ||విలువైనది||

ప్రతి అవసరాన్ని తీర్చే
నాన్న మన ముందరుండగా
అనుక్షణమున నీ చేయి విడువక
ఆయనీతో నడిచెగా
ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా
నిను విడిపించే దేవుడుండగా
అసాధ్యమేముంది – నా యేసయ్యకు
సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు          ||విలువైనది||

English Lyrics

Audio

HOME