నీవేయని నమ్మిక

పాట రచయిత: ముంగమూరి దేవదాస్
Lyricist: Mungamuri Devadas

Telugu Lyrics

నీవేయని నమ్మిక
యేసు నాకు.. నీవేయని నమ్మిక
నీవే మార్గంబు – నీవే సత్యంబు
నీవే జీవంబు – నీవే సర్వంబు           ||నీవే||

పెడదారిని బోవగ
నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ
అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ
తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు            ||నీవే||

కారు మేఘము పట్టగ
నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ
ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ
తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు            ||నీవే||

లేనిపోని మార్గంబు
లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు
మానుగ జేయుచు – వానిని ఖండించి
నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు          ||నీవే||

నరలోకమునుండి
పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి
సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు            ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కృప కృప నీ కృప

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కృప కృప నీ కృప
కృప కృప క్రీస్తు కృప (2)
నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2)        ||కృప||

కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2)        ||కృప||

దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2)        ||కృప||

English Lyrics

Audio

నీవు ప్రార్థన చేయునప్పుడు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)

నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)
ప్రభు మాట మరచితివా          ||పొందియున్నాననే||

బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)
ఆ జయము మరచితివా         ||పొందియున్నాననే||

గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)
ఈ రక్షణానందం            ||పొందియున్నాననే||

English Lyrics

Audio

HOME