నమ్ముకో యేసయ్యను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నమ్ముకో యేసయ్యను
నమ్మకు మనుష్యులను (2)

యోసేపు నమ్మాడు అన్నలను (2)
నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో           ||నమ్ముకో||

సంసోను నమ్మాడు దెలీలాను (2)
నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో           ||నమ్ముకో||

యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2)
నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో           ||నమ్ముకో||

రాజులను నమ్ముట వ్యర్ధమురా (2)
యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు           ||నమ్ముకో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చాలా గొప్పోడు

పాట రచయిత: డేవిడ్ ఫ్రాన్సిస్
Lyricist: David Francis

Telugu Lyrics

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)        ||చాలా||

నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)         ||మాటలలో||

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)         ||మాటలలో||

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2)         ||మాటలలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

జన్మించె జన్మించె

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2)          ||ఊరూ వాడా||

తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు (2)
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి (2)          ||ఊరూ వాడా||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము (2)
మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2)          ||ఊరూ వాడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME