ఎడబాయని నీదు కృప

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)        ||ఎడబాయని||

కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా (2)       ||నన్ను బలపరచెను||

నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే (2)       ||నన్ను బలపరచెను||

నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా (2)       ||నన్ను బలపరచెను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్నెంతగానో ప్రేమించెను

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)     ||నన్నెంత||

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)          ||నన్నెంత||

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)          ||నన్నెంత||

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)          ||నన్నెంత||

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)          ||నన్నెంత||

English Lyrics

Audio

నన్నెంతగానో ప్రేమించిన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)
నా యవ్వనమంతా… నా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME