న్యాయాధిపతి

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)
ఒక గుంపేమో పరలోకపు గుంపు
రక్షింపబడిన వారికే అది సొంతం
మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం       ||న్యాయాధిపతి||

నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది
కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)
కలువరిలో తన ప్రాణం పెట్టిన
యేసయ్యే నీ ప్రాణ రక్షణ
సిలువలో క్రయ ధనమే చెల్లించిన
ఆ ప్రభువే నీ పాప విమోచన         ||ఒక గుంపేమో||

ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు
ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)
మేఘముపై రానైయున్నాడుగా
త్వరలోనే నిను కొనిపోడానికి
వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
నీ హృదిలో స్వీకరించడానికి         ||ఒక గుంపేమో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవు చేసిన త్యాగాన్ని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నశించిపోయే ఆత్మలు ఎన్నో
నరకపు పొలిమేరను చెర
నన్ను పంపుము నన్ను నడిపించుము
నీ ప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో
నీ ఆత్మతో నీ ప్రేమతో
(నను) నిత్యము నడిపించుమా – (2)

నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా
వాడుకొనుము నా ప్రభువా (2)         ||నీవు||

నా జీవితాంతం – మరణ పర్యంతం
నీతోనే నేనుందునయ్యా (2)
కరుణ చూచి నీ మహిమ గాంచితి
నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో
నీ రాజ్యములో పరిశుద్ధులతో (2)
(నిను) నిత్యము కీర్తింతును – (2)         ||నీవు||

English Lyrics

Audio

HOME