కొడవలిని చేత పట్టి

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


కొడవలిని చేత పట్టి కోత కోయుము
తెల్లబారిన పొలములన్నియు (2)
నశియించు ఆత్మల భారము కలిగి
ఆగక సాగుమా ప్రభు సేవలో     ||కొడవలిని||

సర్వ సృష్టికి సువార్త ప్రకటన
ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)
ఎన్నడూ దున్నని భూములను చూడు (2)
కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2)       ||కొడవలిని||

పిలిచిన వాడు నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు (2)
అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)
అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2)       ||కొడవలిని||

English Lyrics

Audio

నశియించు ఆత్మలెన్నియో

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..

నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)
లోకాన చాటగా (4)                   ||నశియించు||

ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2)
ప్రియ యేసు కోరెను (4)              ||నశియించు||

English Lyrics

Audio

HOME