నువ్వెవరో యేసు

పాట రచయిత: Swapna Edwards
Lyricist: స్వప్న ఎడ్వర్డ్స్

Telugu Lyrics

ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే

నువ్వెవరో యేసు నువ్వెవరో…
నా తల్లి కన్నా నీవే
నా తండ్రి కన్నా నీవే
నా అండ దండ తోడు నీడ నీవై
నన్ను కాచితివే
ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే

నా తల్లి నను మరచే
నేనెన్నో సార్లు ఏడ్చే
నీవు నన్ను మరువక
నా ప్రక్కన ఉంటివే
నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే
నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే         ||ఈ లోకం||

నా తండ్రి నను విడచే
నేనొంటరినై నడచే
నీవు నన్ను విడువక
నా చెంత నడచితివే
ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే
తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే
(యేసు) నువ్వేలే నా సర్వం – (2)         ||నా తల్లి||

English Lyrics

Audio

గూడు లేని గువ్వనై

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)

అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది (2)         ||గూడు||

అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది (2)       ||గూడు||

అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2)

గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2)
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2)
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2)

యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిరకాల స్నేహితుడా

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Telugu Lyrics

చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా

చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)

బంధువులు వెలివేసినా
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||

కష్టాలలో కన్నీళ్లలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||

నిజమైనది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ఇంత కాలం

పాట రచయిత: శుభనాథ్ తాడి
Lyricist: Shubhanath Thaadi

Telugu Lyrics

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)         ||ఇంత కాలం||

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||

నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)           ||ఇంత కాలం||

దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)           ||ఇంత కాలం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME