దయాళుడా నీ కృప

పాట రచయిత: చంద్రశేఖర్
Lyricist: Chandra Sekhar

Telugu Lyrics


దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును (4)          ||దయాళుడా||

ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు (2)
అంతా శూన్యంగా మారినప్పుడు (2)
ఆవేదన మదిని నిండినప్పుడు (2)        ||నిత్యముండును||

కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు (2)
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2)        ||నిత్యముండును||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ కృప నిత్యముండును

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||

అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||

English Lyrics

Audio

యేసు రక్తమే జయం

Telugu Lyrics


యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం (2)

పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము (2)

యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును (2)

ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను (2)

English Lyrics

Audio

 

 

HOME