గుండె నిండా యేసు ఉంటే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)

లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2)           ||గుండె నిండా నువ్వే||

ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2)           ||గుండె నిండా నువ్వే||

చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2)           ||గుండె నిండా నువ్వే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీలో జీవించాలని

పాట రచయిత: కే వై రత్నం
Lyricist: K Y Ratnam

Telugu Lyrics

నీలో జీవించాలని
నీలోనే బ్రతకాలని (2)
యుగయుగాల నీతోనే ఉండాలని (2)
తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2)
యేసూ నువ్వే కావాలి
నా యేసూ నీతో ఉండాలి (2)            ||నీలో||

మిగిలింది నాకు నిత్య శోకము
ఈ నా జీవిత యాత్రలో
కన్నీళ్లే నాకు అన్న పానములై
భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2)
నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2)
నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2)             ||యేసూ||

కటిక చీకటే నాకు స్నేహమాయెను
అంధకారమే నాలో నాట్యమాడెను
ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు
మార్గమే తెలియక మతి చెలించెను (2)
నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2)
నీ నామమే నాకు మార్గమాయెను (2)             ||యేసూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఒకసారి నీ స్వరము

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics

ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2)         ||ఒకసారి||

నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన        ||నా ప్రతి||

ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో        ||నా ప్రతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME