నీ చరణములే నమ్మితి

పాట రచయిత: పురుషోత్తము చౌధరి
Lyricist: Purushotthamu Choudhary

Telugu Lyrics

నీ చరణములే నమ్మితి నమ్మితి
నీ పాదములే పట్టితి (2)            ||నీ చరణములే||

దిక్కిక నీవే చక్కగ రావే (2)
మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు            ||నీ చరణములే||

ఐహిక సుఖము – నరసితి నిత్యము (2)
ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని            ||నీ చరణములే||

న్యాయము గాని – నా క్రియలన్ని (2)
రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు            ||నీ చరణములే||

భావము మార్చి – నావెత దీర్చి (2)
దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే            ||నీ చరణములే||

చంచల బుద్ధి – వంచన యెద్ది (2)
ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే            ||నీ చరణములే||

చుర్రుకొని యున్న – శోధనలున్న (2)
పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే            ||నీ చరణములే||

నాచు పిశాచి – నరుకుట గాచి (2)
కాచుకో దాచవే దాచవే దాచవే            ||నీ చరణములే||

యేసుని తోడ – నెవ్వరు సాటి (2)
దోసము బాపును బాపును బాపును            ||నీ చరణములే||

English Lyrics

Audio

త్రాహిమాం క్రీస్తు నాథ

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotthamu Chaudhary

Telugu Lyrics


త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు          ||త్రాహిమాం||

గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో          ||త్రాహిమాం||

నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను
దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో          ||త్రాహిమాం||

నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము – త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా          ||త్రాహిమాం||

నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా          ||త్రాహిమాం||

English Lyrics

Audio

నీ చల్లనైన నీడలో

పాట రచయిత: ఆడమ్ బెన్నీ
Lyricist: Adam Benny

Telugu Lyrics

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)
నీ ప్రేమా నా లోనా (2)
ప్రతిక్షణం అనుభవించనీ (2)          ||నీ చల్లనైన||

మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)
పదిలముగా నను పట్టుకొని (2)
మార్చుకుంటివా నీ పోలికలో (2)
మరణ భయమిక లేదంటివి (2)          ||నీ చల్లనైన||

మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం (2)
హృదయములో నీ ప్రేమా (2)
కుమ్మరించుమా జుంటి తేనెలా (2)
(ఆహా) మధురం మధురం నా జీవితం (2)          ||నీ చల్లనైన||

అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు (2)
నీ సేవలో నే సాగుటకు (2)
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)
నే ఆగక సాగెద నీ సేవలో (2)          ||నీ చల్లనైన||

English Lyrics

Audio

 

 

HOME