కంటి పాపను

పాట రచయిత: మని ప్రకాష్
Lyricist: Mani Prakash

Telugu Lyrics

కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా      ||కంటి||

మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ         ||కంటి||

ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ        ||కంటి||

English Lyrics

Audio

Chords

నాకున్న చిన్ని ఆశ

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)

యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీకై నేను జీవించాలని
నాకున్న చిన్ని ఆశ
నిన్నే నేను సేవించాలని
నాకున్న చిన్ని ఆశ      ||చిట్టి||

English Lyrics

Audio

Chords

చిట్టి పొట్టి పాపను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)

పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||

జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||

English Lyrics

Audio

HOME