పుట్టినాడంట యేసునాథుడు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2)        ||తూరుపు||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2)        ||పుట్టినాడంట||

చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2)        ||పుట్టినాడంట||

మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2)        ||పుట్టినాడంట||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics


తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2)          ||తండ్రి||

వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2)         ||ఆడుదాం||

పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2)         ||ఆడుదాం||

పాపానికి మరణించి
క్రొత్త రూపం పొందితిని (2)         ||ఆడుదాం||

ఆత్మ అనే వస్త్రమిచ్చె
అధికార బలమును ఇచ్చె (2)         ||ఆడుదాం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

హల్లెలూయా ఆరాధన

పాట రచయిత: లిల్లియన్ క్రిస్టోఫర్
Lyricist: Lillyan Christopher

Telugu Lyrics

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం        ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2)        ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2)        ||చప్పట్లు||

English Lyrics

Audio

ప్రేమించు దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

క్రీస్తు పుట్టెను

పాట రచయిత: కే తిమోతి
Lyricist: K Thimothy

Telugu Lyrics

క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)      || అరె గొల్లలొచ్చి ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సీయోను పాటలు సంతోషముగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)

లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2)   ||సీయోను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME