పంపుము దేవా

పాట రచయిత: పులిపాక జగన్నాథము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప         ||పంపుము||

మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు         ||పంపుము||

వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప         ||పంపుము||

ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి         ||పంపుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా నీ నామం

పాట రచయిత: విద్యార్ధి గీతావళి
Lyricist: Vidhyaarthi Geethaavali

Telugu Lyrics


దేవా నీ నామం… పావన ధామం…
బ్రోవుమయ్యా ప్రేమ రూప
నీదు జనులం (2)
నీదు సన్నిధిలో
నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2)
నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం
జయించెదము.. స్తుతించెదము (2)      ||దేవా||

శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2)
బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం
తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2)      ||దేవా||

విన్నపములన్ని విని క్షమియించుము
సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2)
నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం
గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2)        ||దేవా||

English Lyrics

Audio

దేవర నీ దీవెనలు

పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి
Lyricist: Allaari Pedda Veeraaswaami

Telugu Lyrics


దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)

దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ||

ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ||

ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ||

తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ||

సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ||

మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ||

యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ||

వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME