హృదయాలనేలే రారాజు

పాట రచయిత: శాంత వర్ధన్
Lyricist: Shanthavardhan

Telugu Lyrics

హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును       ||హృదయాల||

నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా       ||హృదయాల||

నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా       ||హృదయాల||

English Lyrics

Audio

నా పేరే తెలియని ప్రజలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా (2)
వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)

రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||

నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా||

వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||

English Lyrics

Audio

HOME