కుమ్మరి చేతిలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కుమ్మరి చేతిలో మంటి వలె
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము       ||కుమ్మరి||

నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు సక్కగా చేయుము (2)
నీ పోలిక వచ్చే వరకు
నా చేయి విడువకు (2)
సారె పైనుండి తీసివేయకు (2)      ||కుమ్మరి||

నాలోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసి వేయుము (2)
నీ భుజముపై ఆనుకొనే
బిడ్డగా మార్చుము (2)
నీ చేతితో నడిపించుము (2)      ||కుమ్మరి||

English Lyrics

Audio

యేసు నీ స్వరూపమును

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)
నీ పోలికగా నేను మారేదన్ (2)       ||యేసు||

యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి దీనుడైతివి (2)
నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము (2)       ||యేసు||

ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)
నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము (2)       ||యేసు||

యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్
నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2)
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము
నీ పవిత్రతతో నింపుము (2)       ||యేసు||

English Lyrics

Audio

HOME