ఏ నామములో

పాట రచయిత: అను శామ్యూల్
Lyricist: Anu Samuel

Telugu Lyrics

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)       ||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)       ||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)       ||నీ నామమునే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా

పాట రచయిత: పాలపర్తి ప్రభుదాస్
Lyricist: Palaparthi Prabhudas

Telugu Lyrics


నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము         ||నా ప్రాణ||

ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని (2)
తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2)
నీ తోడు దొరికాక చిగురించితిని (2)        ||నీవు గాక||

శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
కష్టమంతయు తీరిపోయెను
బాధలన్నియు తొలగిపోయెను        ||నీవు గాక||

క్షణమైన నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2)
తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2)
నా కొరకు నీవు నీ కొరకు నేను (2)        ||నీవు గాక||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇశ్రాయేలు దేవా

పాట రచయిత: జయరాజ్
Lyricist: Jayaraj

Telugu Lyrics

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును (2)
ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా        ||ఇశ్రాయేలు||

నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా (2)
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే (2)      ||ఆరాధనా||

నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి
స్తుతుల సింహాసనము నీకు వేయగా (2)
ఆనంద తైలముతో నన్నభిషేకించి
స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2)      ||ఆరాధనా||

నా కొరకు సీయోనును సిద్ధపరచి
మహిమతో తిరిగి రానైయుంటివే (2)
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి
శాశ్వత జీవము నాకిచ్చితివే (2)      ||ఆరాధనా||

English Lyrics

Audio

HOME