ప్రీతిగల మన యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును
క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును

నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు

దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు
మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్
జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును

ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా?
పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు
నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను
కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

English Lyrics

Audio

 

 

తల్లిలా లాలించును

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          ||తల్లిలా||

తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

English Lyrics

Audio

HOME