ఎంత ప్రేమో నాపై

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics

ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా (2)
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా       ||ఎంత||

దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని (2)
నా పాపమంత క్షమించితివి (2)
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2)     ||ఎంత||

పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2)
క్షమియించి నీ రక్షణిచ్చితివి (2)     ||ఎంత||

నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2)
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2)
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2)     ||ఎంత||

English Lyrics

Audio

మమ్మెంతో ప్రేమించావు

పాట రచయిత: మధు
Lyricist: Madhu

Telugu Lyrics


మమ్మెంతో ప్రేమించావు
మా కొరకు మరణించావు
మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా
నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2)
ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…
హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా       ||మమ్మెంతో||

మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు
మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2)
మము విడువకెన్నడూ          ||మమ్మెంతో||

మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు
పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2)
రోగులను నీవు ముట్టావు          ||మమ్మెంతో||

English Lyrics

Audio

HOME