స్తుతి నీకే యేసు రాజా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (2)
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)        ||స్తుతి||

మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము       ||హోసన్నా||

సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైనా శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము       ||హోసన్నా||         ||స్తుతి||

English Lyrics

Audio

ఆ రాజే నా రాజు

పాట రచయిత: బన్ని సుదర్శన్
Lyricist: Bunny Sudarshan

Telugu Lyrics

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2)         ||ఆ రాజే||

యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2)        ||ఆనందమే||

వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2)        ||ఆనందమే||

English Lyrics

Audio

రాజులకు రాజైన ఈ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజులకు రాజైన ఈ మన విభుని
పూజ చేయుటకు రండి
ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని       ||రాజులకు||

కరుణ గల సోదరుండై ఈయన
ధరణికేతెంచెనయ్యా (2)
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును       ||రాజులకు||

నక్కలకు బొరియలుండే నాకాశ
పక్షులకు గూళ్లుండెను (2)
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను       ||రాజులకు||

త్వరపడి రండి రండి ఈ పరమ
గురుని యొద్దకు మీరలు (2)
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము       ||రాజులకు||

English Lyrics

Audio

సమీపింపరాని తేజస్సులో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
వసీయించువాడ నా దైవమా (2)
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా (2)
పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా        ||సమీపింపరాని||

పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2)
దూషకుడను హానికరుడైన నన్ను (2)
కరుణించి మార్చివేసితివి (2)            ||సమీపింపరాని||

నా దేవా… నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2)
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2)
నీ స్వరూపములోకి నను మార్చుము (2)           ||సమీపింపరాని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

తార వెలిసింది

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

English Lyrics

Audio

రాజులకు రాజు పుట్టెనన్నయ్య

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)
రారే చూడ మనమేగుదామన్నయ్య (2)  ||రాజులకు||

యుదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2)  ||రాజులకు||

తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2)    ||రాజులకు||

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2)  ||రాజులకు||

ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2)      ||రాజులకు||

English Lyrics

Audio

 

 

HOME