మహిమ నీకే ఘనత నీకే

పాట రచయిత: రవీందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics


మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు            ||దరిద్రులను||

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు           ||దరిద్రులను||

English Lyrics

Audio

ఆశ్చర్య కార్యముల్

పాట రచయిత: స్వర్ణ గీత కొమానపల్లి
Lyricist: Swarna Geetha Komanapalli

Telugu Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||

రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు నీ వారము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నీ వారము – నీవే మా రాజువు (2)
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2)      ||యేసు||

మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే (2)
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2)      ||యేసు||

ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు
అన్నీ నీవొసగినవే
ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని
మాకోసం నిలిపితివే (2)
ఆద్యంతముల ప్రభువా
ఆరాధింతుము నిన్నే (2)      ||యేసు||

సిలువలో మరణించి – మరణమునే ఓడించి
జయమును పొందితివే
పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి
పరమును ఒసగితివే (2)
మమ్మెంతో ప్రేమించి
మా కొరకు నిలచితివే (2)      ||యేసు||

English Lyrics

Audio

 

 

HOME