నీ సాక్ష్యము ఏది

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ సాక్ష్యము ఏది
నీ బలియర్పణ ఏది (2)
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
మేల్కో లెమ్ము (2)
రారమ్ము విశ్వాసి        ||నీ సాక్ష్యము||

అపోస్తుల కాలమందు
ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2)
ఆత్మలాదాయము చేసిరి       ||నీ సాక్ష్యము||

కొరడాతో కొట్టబడిరి
చెరసాలయందుంచబడిరి (2)
చెరసాల సంకెళ్లును (2)
వారినాటంక పరచలేదు         ||నీ సాక్ష్యము||

కోత విస్తారమెంతో
కోత కోయువారు కొందరే (2)
యేసు నిన్ పిలచుచుండే (2)
త్రోసివేసెదవా ప్రభు పిలుపును        ||నీ సాక్ష్యము||

English Lyrics

Audio

యేసయ్యా నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ
రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన
చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన
ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా         ||రమ్ము||

నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ
అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా
అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా       ||రమ్ము||

అమూల్యమైన రత్నములతో అలంకరించబడి
గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న
అంధకారమే లేని ఆ దివ్యనగరమందు
అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను          ||రమ్ము||

English Lyrics

Audio

 

 

HOME