నన్ను గన్నయ్య రావె

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotham Chaudhary

Telugu Lyrics


నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||

కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||

English Lyrics

Audio

దేవ దాసపాలక

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


దేవ దాసపాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
దేవా దేవా దీన పోషకా         ||దేవ||

లోక బాధ ఇరుకు శోధన నుండి
స్వీకరించినావు త్రియేక దేవుడా
స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ         ||దేవ||

దిక్కులేని పాపి కొరకు నీ దేహం
మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందగా          ||దేవ||

కఠినులంత కుటిలము జేసి నిన్ను
గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా
యిదే నా యెడ బ్రేమ జూపితి         ||దేవ||

ఇంత యొర్పు యింత శాంతమా నాకై
పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా
పాపి నీదగు దాపు జేర్చవే         ||దేవ||

కలువరి గిరి వరంబున నాకై
తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా
హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్        ||దేవ||

English Lyrics

Audio

త్రాహిమాం క్రీస్తు నాథ

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotthamu Chaudhary

Telugu Lyrics


త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు          ||త్రాహిమాం||

గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో          ||త్రాహిమాం||

నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను
దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో          ||త్రాహిమాం||

నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము – త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా          ||త్రాహిమాం||

నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా          ||త్రాహిమాం||

English Lyrics

Audio

HOME