గాయపడిన నీ చేయి

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది      ||గాయపడిన||

ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి (2)
సురూపమైనా ఏ సొగసైనా (2)
లేనివానిగా నాకై మారితివి      ||గాయపడిన||

మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి (2)
మా రోగములు మా వ్యసనములు (2)
నిశ్చయముగా నీవు భరియించితివి      ||గాయపడిన||

నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది (2)
నీవు కార్చిన రక్తమే (2)
మా అందరికీ ఇల ప్రాణాధారము      ||గాయపడిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎనలేని ప్రేమ

పాట రచయిత: సృజిత్ మనూక
Lyricist: Srujith Manuka

Telugu Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా (2)
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము         ||ఎనలేని||

కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా (2)
చెమట రక్తముగా మారినా (2)          ||ఊహించగలనా||

ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా (2)
పరలోక తండ్రియే చేయి విడచినా (2)          ||ఊహించగలనా||

English Lyrics

Audio

కల్వరి గిరిపై సిలువ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)

దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||

మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)       ||కల్వరి||

ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)       ||కల్వరి||

English Lyrics

Audio

HOME