రండి రండి యేసుని యొద్దకు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో         ||రండి||

కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు        ||రండి||

ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై       ||రండి||

యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును      ||రండి||

నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు     ||రండి||

English Lyrics

Audio

Chords

రమ్మనుచున్నాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు (2)

ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు (2)                ||రమ్మను||

కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును (2)                ||రమ్మను||

సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము (2)                  ||రమ్మను||

సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ (2)                 ||రమ్మను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME