పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)
అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే||
కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)
మోషేగా మారిన పసివాడిని
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా||
సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2)
హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2)
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా||
కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2)
ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2)
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||
English Lyrics
Audio
Download Lyrics as: PPT