యేసు ఒక్కడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)
నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)
ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)           ||యేసు||

పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2)          ||హల్లెలూయా||

దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము
ఈ భువిలో వెలసిన మానవ రూపము (2)          ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సజీవ సాక్షులుగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము (2)
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో (2)       ||సజీవ||

తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు (2)       ||సజీవ||

ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2)
జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు (2)       ||సజీవ||

English Lyrics

Audio

కీర్తి హల్లెలూయా

పాట రచయిత: రాజేష్ తాటపూడి
Lyricist: Rajesh Tatapudi

Telugu Lyrics


కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమిదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే

ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
మాతో నడువగా – భయమే లేదుగా        ||స్తుతి||

క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
సత్యం రూఢిగా – జీవం నీయగా        ||స్తుతి||

English Lyrics

Audio

Chords

యేసుని ప్రేమ యేసు వార్త

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము        ||యేసుని||

మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో (2)
చితికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

English Lyrics

Audio

 

 

HOME