మానవుడవై సకల

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు – (2)
బహు ప్రేమ తోడ         ||మానవుడవై||

నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2)
నియమంబు నిచ్చి         ||మానవుడవై||

నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2)
నా యన్న యేసు         ||మానవుడవై||

మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి – (2)
నీ ప్రేమ నుండి         ||మానవుడవై||

నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ – (2)
నిజ భక్తి తోడ         ||మానవుడవై||

ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప – (2)
శ్రీ యేసు దేవా         ||మానవుడవై||

నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ – (2)
నిజ రూప మొంద         ||మానవుడవై||

నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే – (2)
నా దివ్య యేసు         ||మానవుడవై||

నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే – (2)
నా దివ్య యేసు         ||మానవుడవై||

నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే – (2)
నిజ దేవా యేసు         ||మానవుడవై||

నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు – (2)
ఎన్నడును మరువను         ||మానవుడవై||

English Lyrics

Audio

సర్వకృపానిధియగు ప్రభువా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా (2)
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను (2)

హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను

ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి (2)     ||హల్లెలూయా||

అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి (2)   ||హల్లెలూయా||

మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2)     ||హల్లెలూయా||

భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)     ||హల్లెలూయా||

ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై  (2)
హేతువు లేకయే ప్రేమించెన్‌
యేసుకు నేనేమివ్వగలన్‌ (2)     ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME