హృదయపూర్వక ఆరాధన

పాట రచయితలు: ఫిలిప్ గరికి & షారోన్ ఫిలిప్
Lyricists: Philip Gariki & Sharon Philip

Telugu Lyrics

హృదయపూర్వక ఆరాధన
మహిమ రాజుకే సమర్పణ (2)
నిత్యనివాసి సత్యస్వరూపి
నీకే దేవా మా స్తుతులు (2)         ||హృదయ||

నా మనసు కదిలించింది నీ ప్రేమ
నా మదిలో నివసించింది నీ కరుణ
ఎంతో ఉన్నతమైన దేవా (2)
క్షేమాధారము రక్షణ మార్గము
మాకు సహాయము నీవేగా (2)         ||హృదయ||

ఆత్మతో సత్యముతో ఆరాధన
నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన
నీకై పాడెదను యేసయ్యా (2)
కృపామయుడా కరుణ సంపన్నుడా
నిత్యము నిన్నే పూజింతును (2)         ||హృదయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సమర్పణ చేయుము ప్రభువునకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)

అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా       ||సమర్పణ||

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

English Lyrics

Audio

 

 

HOME