నల్లా నల్లాని చీకటి

పాట రచయిత: కిరణ్ జిమ్మి
Lyricist: Kiran Jimmy

ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది

ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై

నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)
నల్లా నల్లని నీ హృదయము
యేసుకిస్తే తెల్లగ మారును (2)

తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2)

సీకట్ల సుక్క బుట్టెరో
ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2)
నీ మనస్సులో యేసు బుడితే
నీ బతుకే ఎలిగి పొవును (2)       ||తూర్పున చుక్క||

చల్లా చల్లాని చలిరో
ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో
చల్లగుంటే సల్లారి పొతవ్
ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2)       ||తూర్పున చుక్క||

హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)

నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)

హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)

Download Lyrics as: PPT

రాజు పుట్టెను

పాట రచయిత: శ్యామ్ జోసఫ్
Lyricist: Shyam Joseph

Telugu Lyrics

రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇద్దరొక్కటిగ మారేటి

పాట రచయిత: సాయరాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)

ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి (2)
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)           ||వివాహమన్నది||

ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)           ||వివాహమన్నది||

భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2)           ||వివాహమన్నది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బెత్లెహేములో సందడి

పాట రచయిత: ఎన్ మేరీ విజయ్
Lyricist: N Mary Vijay

Telugu Lyrics

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)       ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)       ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)       ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)       ||బెత్లెహేములో||

English Lyrics

Audio

బెత్లహేములోనంటా సందడి

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

Telugu Lyrics


బెత్లహేములోనంటా – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
పాటలు పాడేనంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

అర్ధ రాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
రక్షకుడు పుట్టెనని – సందడి
వార్తను తెలిపేనటా – సందడి (2)
చేసారంట సందడే సందడి
చెయ్యబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

గొల్లలు వచ్చిరంటా – సందడి
మనసారా మ్రొక్కిరంటా – సందడి
అందాల బాలుడంటా – సందడి
అందరి దేవుడని – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

తారను చూచుకుంటూ – సందడి
జ్ఞానులు వచ్చారంటా – సందడి
పెట్టెలు తెచ్చారంటా – సందడి
కానుకలిచ్చారంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బాలుడు కాదమ్మో

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

Telugu Lyrics


బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||

కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

English Lyrics

Audio

HOME