సర్వ చిత్తంబు నీదేనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును         ||సర్వ చిత్తంబు||

ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా          ||సర్వ చిత్తంబు||

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా          ||సర్వ చిత్తంబు||

ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా         ||సర్వ చిత్తంబు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నా దొరా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా (2)        ||యేసయ్యా||

మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా (2)
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట (2)        ||యేసయ్యా||

నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2)        ||యేసయ్యా||

నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా (2)
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా (2)        ||యేసయ్యా||

English Lyrics

Audio

 

 

HOME