గాయపడిన నీ చేయి

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)
సిలువే నాకు విలువైనది (2)
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది      ||గాయపడిన||

ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి (2)
సురూపమైనా ఏ సొగసైనా (2)
లేనివానిగా నాకై మారితివి      ||గాయపడిన||

మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి (2)
మా రోగములు మా వ్యసనములు (2)
నిశ్చయముగా నీవు భరియించితివి      ||గాయపడిన||

నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది (2)
నీవు కార్చిన రక్తమే (2)
మా అందరికీ ఇల ప్రాణాధారము      ||గాయపడిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా యెహోవా సీయోనులో

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


దేవా యెహోవా సీయోనులో నుండి
స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2)

కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం
కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం
రక్తాన్ని చిందించి రక్షించినావా
ఈ పాపిని యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీకేమర్పింతును – (2)        ||దేవా||

నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా
నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా
ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై
బలియైతివా యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీ సిలువే చాలయా – (2)        ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రైస్తవుడా సైనికుడా

పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu

Telugu Lyrics


క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా (4)

జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి        ||క్రైస్తవుడా||

సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2)        ||క్రైస్తవుడా||

సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2)        ||క్రైస్తవుడా||

దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2)        ||క్రైస్తవుడా||

సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2)        ||క్రైస్తవుడా||

వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2)        ||క్రైస్తవుడా||

English Lyrics

Audio

సిలువే నా శరణాయెను రా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

సిలువ ధ్యానం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ సిలువే నా శరణము (2)
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు (2)
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును

గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2)

సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2)
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా (2)

గొల్గొతా కొండ పైన (2)
గాయాలు పొందితివే (3)

చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2)
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2)

కల్వారిలో జీవామిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము

కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2)
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము

హాల్లేలూయా హాల్లేలూయా (3)
నిన్నే ఆరాధింతుమ్ (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME