కల్వరిగిరిలోన సిల్వలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)

ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||

వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||

సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||

English Lyrics

Audio

 

 

సిల్వలో నాకై కార్చెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)

సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)

సమాధాన పరచును – యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)

నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)

రోగములను బాపును – యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME