మంచి స్నేహితుడు

పాట రచయిత: సురేష్ వంగూరి
Lyricist: Suresh Vanguri

Telugu Lyrics

మంచి స్నేహితుడు (2)
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు (2)        ||మంచి స్నేహితుడు||

ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఒక దివ్యమైన సంగతితో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని          ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)        ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)        ||ఒక దివ్యమైన ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నమ్మకమైన నా స్నేహితుడు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


నమ్మకమైన నా స్నేహితుడు
నా ప్రభు యేసుడు (2)
ఎడబాయనివాడు విడువనివాడు (2)
నిన్న నేడు ఒకటిగనున్నవాడు           ||నమ్మకమైన||

ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)
వ్యాధిలో భాధలో (2)
నను స్వస్థపరచువాడు
అనుక్షణం నా ప్రక్కన నిలచి
ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)
అన్నివేళలా నన్నాదరించువాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2)     ||నమ్మకమైన||

కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)
కలతలలో కన్నీళ్ళలో (2)
నను ఓదార్చువాడు
కన్నతల్లిని మించిన ప్రేమతో
అరచేతిలో నను దాచినవాడు (2)
ఎన్నడు నన్ను మరువనివాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2)    ||నమ్మకమైన||

English Lyrics

Audio

HOME