నే బ్రతికి ఉన్నానంటే

పాట రచయిత: పి దైవ కుమారి
Lyricist: P Daiva Kumari

Telugu Lyrics

నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప
ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2)
నీ ప్రేమ బలమైనది
నీ మాట విలువైనది (2)        ||నే బ్రతికి||

లోకములో నేనుండగా
నీ కరములు చాపి పిలిచావయ్యా
దుఃఖములో నేనుండగా
నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే (2)        ||నే బ్రతికి||

నా వారలే నన్ను నిందించినా
నా బంధువులే నన్ను వెలివేసినా (4)
ఎవరున్నా లేకున్ననూ
నీ తోడు చాలునయ్యా
ఏమున్నా లేకున్ననూ
నీ కృపయే చాలునయ్యా        ||నే బ్రతికి||

నా స్థితి నీవు చూసావయ్యా
నా గతినే నీవు మార్చావయ్యా (2)
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే (2)        ||నే బ్రతికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నమ్మకమైన దేవుడవైన

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2)        ||నమ్మకమైన||

ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2)        ||నమ్మకమైన||

English Lyrics

Audio

కనురెప్ప పాటైన

పాట రచయిత: గుంటూరు రాజా
Lyricist: Guntur Raja

Telugu Lyrics


కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

English Lyrics

Audio

ఎంతటి వాడను నేను

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)            ||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు            ||ఎంతటి||

నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే          ||ఎంతటి||

English Lyrics

Audio

జీవించుచున్నావన్న

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవించుచున్నావన్న పేరు ఉన్నది
మృతుడవే నీవు మృతుడవే (2)
ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు
జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2)   ||జీవించు||

సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరా
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరీ
నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2)
యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2)     ||జీవించు||

అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము
పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2)
వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2)
యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2)      ||జీవించు||

ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా
దొంగ వలె వచ్చెదనని అన్నాడు (2)
గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2)
అంతము వరకు నిలిచి యుండుమా (2)    ||జీవించు||

English Lyrics

Audio

 

 

ఏ సమయమందైనా

పాట రచయిత: ఆకుమర్తి డేనియల్
Lyricist: Akumarthi Daniel

Telugu Lyrics

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా     ||ఏ సమయమందైనా||

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే     ||ఆరాధనా||

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే    ||ఆరాధనా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME