యేసు రక్షకా

Telugu Lyrics


యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2)        ||యేసు రక్షకా||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2)        ||యేసు రక్షకా||

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3)        ||యేసు ఆరాధించెదను||

English Lyrics

Audio

స్తోత్రబలి స్తోత్రబలి

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics


స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)

నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

English Lyrics

Audio

హల్లెలూయా స్తోత్రం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)          ||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)          ||హల్లెలూయా||

English Lyrics

Audio

జయ జయ యేసు

పాట రచయిత: కొటికల మనోహరం
Lyricist: Kotikala Manoharam

Telugu Lyrics

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||

మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు      || జయ జయ ||

సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు       || జయ జయ ||

సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించె జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||

బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు తీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||

ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)
ముద్రలు తీయుము జయ యేసు (2)
ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||

కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)
సేవలో బలము జయ యేసు (2)
జీవము నీవే జయ యేసు        || జయ జయ ||

దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)
కయ్యము గెల్చిన జయ యేసు (2)
అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తోత్రం చెల్లింతుము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి          ||స్తోత్రం||

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       ||స్తోత్రం||

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      ||స్తోత్రం||

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      ||స్తోత్రం||

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     ||స్తోత్రం||

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       ||స్తోత్రం||

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)      ||స్తోత్రం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME