మంచే లేని నా పైన

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: AR Stevenson

Telugu Lyrics


మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2)         ||మంచే లేని||

లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)
నీదెంత దీన మనస్సు
నా కెంత ఘనత యేసు (2)        ||ఎంతగా||

నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2)
నీలోన జాలి పొంగె
నాలోన శాంతి నిండె (2)          ||ఎంతగా||

చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2)
నీ సాటిలేని త్యాగం
నా పాలి గొప్ప భాగ్యం (2)          ||ఎంతగా||

English Lyrics

Audio

జీవితంలో నీలా ఉండాలని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత (2)      ||జీవితంలో||

కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే నడవాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో (2)
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

English Lyrics

Audio

 

 

HOME