సుదూరము ఈ పయనము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము||

అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము||

హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును       ||సుదూరము||

నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ       ||సుదూరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రభువా నీ పరిపూర్ణత నుండి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు       ||ప్రభువా||

జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక        ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కృప వెంబడి కృపతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా (2)
నను కరుణించిన నా యేసయ్యా (2)         ||కృప||

నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా (2)
నా యెడల నీకున్న వాంఛలన్నియు            ||కృప||

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా           ||కృప||

English Lyrics

Audio

నా కనుల వెంబడి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక

చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4)             ||నా కనుల||

అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)      ||చిరునవ్వుతో||

సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)        ||చిరునవ్వుతో||

English Lyrics

Audio

HOME